▶ Reels

నొప్పుల ముప్పు..55 ఏళ్లలోపే తీవ్రం.. పురుషుల కంటే మహిళల్లోనే అధికం..! అధ్యయనంలో వెల్లడి..

 

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో నొప్పులు రావడం సహజమని అందరూ భావిస్తుంటారు. కానీ, తాజా అధ్యయనాలు ఈ నమ్మకాన్ని పటాపంచలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషులను పట్టిపీడిస్తున్న శారీరక నొప్పులపై జరిగిన ఒక బృహత్తర అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. 55 ఏళ్ల వయసు రాకముందే శరీర నొప్పులు మనుషులను వేగంగా చుట్టుముడుతున్నాయని, ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లోనే ఈ సమస్య తీవ్రంగా ఉందని తేలింది. పొగతాగడం, స్థూలకాయం, ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ నొప్పులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని 'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక స్పష్టం చేసింది.


భారీ అధ్యయనంలో వెల్లడైన కీలక అంశాలు..


ప్రపంచవ్యాప్తంగా 118 దేశాలకు చెందిన సుమారు 61 లక్షల మందిపై పరిశోధకులు ఈ విశ్లేషణ జరిపారు. 5 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వయసు పైబడిన వారి ఆరోగ్య సమాచారాన్ని 1990 నుంచి 2025 మధ్య పరిశీలించారు. తల, మెడ, భుజాలు, నడుము, మోకాలు, కడుపు సహా 11 ప్రధాన శరీర భాగాల్లో వచ్చే నొప్పులను విశ్లేషించారు.


మహిళలకే ముప్పు ఎక్కువ..


 శరీరంలోని 11 ప్రధాన భాగాల్లో వచ్చే నొప్పుల పరంగా చూస్తే.. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా బాధపడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ముఖం నొప్పి (83 శాతం), తలనొప్పి (74 శాతం), కడుపునొప్పి (60 శాతం) సమస్యలు స్త్రీలలోనే అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. శారీరక జీవసంబంధమైన మార్పులు, ఒత్తిడి, ఇతర అనారోగ్య కారకాలు ఇందుకు కారణం కావొచ్చు.


నొప్పుల తీరు - వయసుతో పాటు మారుతున్న వైనం..


అన్ని రకాల నొప్పులు వయసుతో పాటే పెరగవు. తలనొప్పి, కడుపు, మెడ, భుజాలు, మోచేతుల నొప్పులు మధ్య వయసులో (middle age) గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయి. కానీ నడుము, తుంటి, మోకాళ్ల నొప్పులు మాత్రం వయసుతో పాటే పెరిగి 75 ఏళ్లు లేదా ఆ పైబడిన వయసులో పరాకాష్ఠకు చేరుకుంటాయి. సగటున 5 ఏళ్ల వయసులో 30 శాతంగా ఉన్న నొప్పుల ముప్పు, 100 ఏళ్లు వచ్చే సరికి 70 శాతానికి చేరుకుంటోంది.


పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్రత..


 తక్కువ మానవాభివృద్ధి సూచిక (HDI) ఉన్న దేశాల్లో 40 ఏళ్ల తర్వాత నడుము, కీళ్ల నొప్పుల తీవ్రత చాలా వేగంగా పెరుగుతోంది. మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న దేశాలతో పోలిస్తే.. పేద దేశాల్లో 80 ఏళ్లు పైబడిన వారిలో నడుము కింది భాగంలో వచ్చే నొప్పుల శాతం రెట్టింపుగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.


పొగతాగడం, స్థూలకాయమే అసలు శత్రువులు..


 చెడు అలవాట్లు కూడా నొప్పులను కొనితెస్తున్నాయి. ధూమపానం, ఊబకాయం (obesity), తక్కువ ఆదాయం వల్ల ఏర్పడే జీవనశైలి సమస్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా 18 శాతం నొప్పుల కేసులు నమోదవుతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.


 నొప్పులను కేవలం 'వృద్ధాప్య సమస్య'గా కొట్టిపారేయకూడదు. నొప్పుల నివారణకు సంబంధించిన జాగ్రత్తలు వృద్ధాప్యంలో కాకుండా, యవ్వనం మరియు మధ్య వయసు నుంచే ప్రారంభించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహà°...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **కà...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్తà...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-కà...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.