▶ Reels

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?


ఈ-కామర్స్, క్విక్-కామర్స్ యాప్‌ల పుణ్యమా అని నిమిషాల్లో మందులు ఇంటికి చేరుతున్నాయి. అయితే, వేగంతో పాటు రోగుల భద్రత కూడా అంతే వేగంగా ప్రమాదంలో పడుతోందా..? డాక్టర్ల  ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇన్ హౌజ్ టెలి కన్సల్టేషన్ పేరిట జరుగుతున్న తూతూమంత్రం తనిఖీలపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఒక నగరవాసికి ఎదురైన అనుభవం ఆన్‌లైన్ ఫార్మసీల డొల్లతనాన్ని బయటపెట్టింది. రక్తపోటు (bp) మందులు అయిపోవడంతో ఆయన ఒక ప్రముఖ క్విక్-కామర్స్ యాప్ ద్వారా 'టెల్మా 40' ఆర్డర్ చేశారు. ప్రిస్క్రిప్షన్ అడగ్గా, తన వద్ద లేదని చెప్పారు. వెంటనే సదరు యాప్ ప్యానెల్‌లోని ఒక 'డాక్టర్' ఫోన్ చేసి.. వయసు, ఎంతకాలంగా వాడుతున్నారనే రెండు ప్రాథమిక ప్రశ్నలు అడిగి క్షణాల్లో ఆర్డర్ ఓకే చేసేశారు. పది నిమిషాల్లో మందుల స్ట్రిప్ ఇంటికి వచ్చేసింది.

కాగితం మీద నిబంధనలు పాటించినట్లు కనిపించినా, అసలు ప్రశ్న ఏమిటంటే..? బీపీ లేని వ్యక్తి కూడా ఇదే తరహాలో సమాధానాలు చెప్పి ఆ మందును సులభంగా పొందగలరా? ఒక చిన్న వెరిఫికేషన్ కాల్.. ఒక రోగి గుండె, కిడ్నీల పనితీరు, పాత వైద్య చరిత్రను అంచనా వేయగలదా..?

వైద్యుల హెచ్చరిక.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!

ఈ ధోరణిపై దేశంలోని ప్రముఖ అంతర్గత వైద్య నిపుణులు (Internal Medicine Specialists) తీవ్రంగా స్పందిస్తున్నారు. వారు చెబుతున్న ముఖ్యమైన విషయాలు:

శరీర వ్యవస్థలపై ప్రభావం: బీపీ నియంత్రించే 'టెల్మా 40' (టెల్మిసార్టన్) వంటి మందులను రోగి కిడ్నీ పనితీరు, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను చూసి మాత్రమే డాక్టర్లు సూచిస్తారు. సరైన పరీక్షలు లేకుండా వీటిని వాడితే బీపీ ఒక్కసారిగా పడిపోవడం, కళ్లు తిరగడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు.

యాంటీబయాటిక్స్ దుర్వినియోగం..

ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల శరీరంలో 'యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్' (మందులకు లొంగని బ్యాక్టీరియా) పెరిగిపోతుంది. భవిష్యత్తులో చిన్న ఇన్ఫెక్షన్‌కు కూడా మందులు పనిచేయవు.

మత్తు పదార్థాల ముప్పు..

 నిద్రమాత్రలు, యాంగ్జైటీ మందులు, పెయిన్ కిల్లర్స్ ఇలా ఆన్‌లైన్‌లో సులభంగా లభిస్తే ప్రజలు వాటికి బానిసలయ్యే ప్రమాదం ఉంది.

ఎక్స్‌పైరీ డేట్, ప్యాకేజింగ్.. ఆన్‌లైన్ కొనుగోళ్లలో పెద్ద లోపం

సాధారణ మెడికల్ షాపుకు వెళ్తే మనం మందుల ఎక్స్‌పైరీ డేట్ స్వయంగా చూసి కొంటాం. కానీ ఆన్‌లైన్ ఆర్డర్లలో మందు ఇంటికి వచ్చాకే బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ తెలుస్తుంది. డెలివరీ అయ్యాక నష్టనివారణ కష్టమవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం..

గడువు ముగిసిన సాధారణ టాబ్లెట్లు వాడితే వాటి పనితీరు తగ్గుతుందే తప్ప తక్షణ ప్రమాదం జరగకపోవచ్చు. కానీ అత్యవసర మందులైన ఇన్సులిన్, వ్యాక్సిన్లు, ఐ డ్రాప్స్, గుండె జబ్బుకు వాడే నైట్రోగ్లిజరిన్, లిక్విడ్ యాంటీబయాటిక్స్ ఎక్స్‌పైరీ దాటాక అస్సలు వాడకూడదు. వీటి పొటెన్సీ తగ్గితే ప్రాణాలకే ముప్పు రావచ్చు.

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు పలు నియమాలు తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్యాకేజింగ్ పరిశీలన..మందుల ప్యాకింగ్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడాలి. డ్యామేజ్ అయి ఉంటే స్టోరేజ్ సరిగ్గా లేనట్లే.

బిల్లు తనిఖీ: డెలివరీతో పాటు వచ్చిన బిల్లుపై బ్యాచ్ నంబర్, మందు పేరు సరిగ్గా సరిపోలాయో లేదో చూసుకోవాలి.

చిన్న షెల్ఫ్ లైఫ్.. చాలా తక్కువ రోజుల్లో ఎక్స్‌పైరీ అవ్వబోయే మందులను దీర్ఘకాలిక వ్యాధుల కోసం అంటే..? బీపీ, షుగర్ వంటి వాటికి వాడే మెడిసిన్స్ ను స్టాక్ పెట్టుకోవద్దు.

Related Blogs


క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE

ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తోందా..? ఐతే ఈ 5 ప్రధాన కారణాలను అస్సలు విస్మరించవద్దు..!

June 25, 2026

ఉదయం లేచింది మొదలు...

READ MORE

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 1,094కు చేరిన కేసులు, రక్షణ పరికరాల కొరతతో వైద్యుల ఆందోళన..!

June 24, 2026

ఆఫ్రికా ఖండంలోని డ...

READ MORE

మెదడు ఆరోగ్యానికి రష్యన్ శాస్త్రవేత్తల సరికొత్త ‘సైక్లిక్ పెప్టైడ్’..

June 24, 2026

వృద్ధాప్యంలో వేధి...

READ MORE

వైద్యుడి సలహా లేకుండా కాల్షియం టాబ్లెట్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

June 23, 2026

నేటి ఆధునిక కాలంలో...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.