రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను భారీగా పెంచారు.
| కేటగిరీ | విద్యార్థులు | ప్రస్తుత స్టైపెండ్ | పెంచిన స్టైపెండ్ |
|---|---|---|---|
| హౌస్ సర్జన్స్ – ఆయుర్వేదం | 126 | ₹13,754 | ₹29,792 |
| హౌస్ సర్జన్స్ – హోమియోపతి | 125 | ₹13,754 | ₹29,792 |
| హౌస్ సర్జన్స్ – యునాని | 94 | ₹13,754 | ₹29,792 |
| హౌస్ సర్జన్స్ – నేచురోపతి | 60 | ₹13,754 | ₹29,792 |
| మొత్తం హౌస్ సర్జన్లు | 405 | — | — |
| పీజీ 1వ సంవత్సరం | 131 | ₹30,947 | ₹67,032 |
| పీజీ 2వ సంవత్సరం | 131 | ₹32,665 | ₹70,757 |
| పీజీ 3వ సంవత్సరం | 131 | ₹34,385 | ₹74,482 |
| మొత్తం పీజీ విద్యార్థులు | 393 | — | — |
మొత్తంగా 798 మంది విద్యార్థులు ఈ స్టైపెండ్ పెంపుతో లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా హౌస్ సర్జన్లకు నెలవారీ స్టైపెండ్ ₹13,754 నుంచి ₹29,792కు పెరగగా, పీజీ విద్యార్థులకు సంవత్సరం వారీగా ₹67,032 నుంచి ₹74,482 వరకు పెంచారు.

