మూత్రంలో మార్పులతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. శరీరంలోని అదనపు నీరు, ఉప్పు బయటకు వెళ్లకపోవడం వల్ల ముఖం, పాదాలు, చీలమండల వద్ద వాపు వస్తుంది. రక్తహీనత , వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంది.
ఆకలి మందగించడం.. వికారం, వాంతులు కావడం, ఆకలి తగ్గడం వంటివి కనిపిస్తాయి. రక్తంలో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత వల్ల చర్మం పొడిబారి దురద పెట్టడం, కండరాలు పట్టేయడం జరుగుతుంది.
ప్రధాన కారణాలు..
నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీసే ప్రధాన శత్రువులు. వీటితో పాటు కిడ్నీలో రాళ్లు, తరచూ వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా నొప్పి నివారణ మాత్రలు వాడటం వల్ల కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.


