▶ Reels

Heath Tips

వడదెబ్బ నుంచి రక్షిణించే సింపుల్ టిప్స్ ఇవిగో


రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు ప్రారంభమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు శరీరాన్ని అలసిపోయేలా చేయడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, వడదెబ్బ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వడదెబ్బ అనేది శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగే ఒక పరిస్థితి. పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వ్యక్తులు ముఖ్యంగా దీని బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..? దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తగినంత నీరు..

ఉంష్ణోగ్రతలు పెరిగిన సమయంలో శరీరం చెమట ద్వారా నీటిని, అవసరమైన ఎలక్ట్రోలైట్లను వేగంగా కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనికారణంగా, నీరసం, తల తిరగడం, అలసట వంటి లక్షణాలుతలెత్తుతాయి. అందువల్ల, రోజంతా ఎక్కువగా నీరు తాగాలి లేదంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నిమ్మరసం లేదా ఓఆర్ఎస్ వంటి పానీయాలను తీసుకోవాలి.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యకిరణాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఎండకు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగి, వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది. మీరు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, మీ తలను గుడ్డ, టోపీ లేదా గొడుగు వాడండి.

తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించండి..

వేసవిలో కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఈ దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచి, చెమటను త్వరగా పీల్చుకుని, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులు వేడిని పెంచుతాయి, కాబట్టి అలాంటివి ధరించకూడదు.

చల్లని పానీయాలు తాగాలి.

నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు శరీరాన్ని చల్లబరిచి, ఎలక్ట్రోలైట్లను తిరిగి అందిస్తాయి. ఈ పానీయాలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, శక్తిని అందించి, అలసటను తగ్గిస్తాయి.

సమతుల్య ఆహారం తీసుకోండి

వేసవిలో తేలికైన, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్‌లు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అధికంగా వేయించిన, మసాలా దినుసులు వేసిన ఆహారం తీసుకోకపోవడమే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు, ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి, వడదెబ్బ ప్రమాదాన్ని అధికం చేస్తాయి.

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహ...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **క...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్త...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE

ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తోందా..? ఐతే ఈ 5 ప్రధాన కారణాలను అస్సలు విస్మరించవద్దు..!

June 25, 2026

ఉదయం లేచింది మొదలు...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.