ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MORE
రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు ప్రారంభమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు శరీరాన్ని అలసిపోయేలా చేయడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, వడదెబ్బ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వడదెబ్బ అనేది శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగే ఒక పరిస్థితి. పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వ్యక్తులు ముఖ్యంగా దీని బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..? దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తగినంత నీరు..ఉంష్ణోగ్రతలు పెరిగిన సమయంలో శరీరం చెమట ద్వారా నీటిని, అవసరమైన ఎలక్ట్రోలైట్లను వేగంగా కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనికారణంగా, నీరసం, తల తిరగడం, అలసట వంటి లక్షణాలుతలెత్తుతాయి. అందువల్ల, రోజంతా ఎక్కువగా నీరు తాగాలి లేదంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నిమ్మరసం లేదా ఓఆర్ఎస్ వంటి పానీయాలను తీసుకోవాలి.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యకిరణాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఎండకు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగి, వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది. మీరు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, మీ తలను గుడ్డ, టోపీ లేదా గొడుగు వాడండి.
తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించండి..వేసవిలో కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఈ దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచి, చెమటను త్వరగా పీల్చుకుని, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులు వేడిని పెంచుతాయి, కాబట్టి అలాంటివి ధరించకూడదు.
చల్లని పానీయాలు తాగాలి.నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు శరీరాన్ని చల్లబరిచి, ఎలక్ట్రోలైట్లను తిరిగి అందిస్తాయి. ఈ పానీయాలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, శక్తిని అందించి, అలసటను తగ్గిస్తాయి.
సమతుల్య ఆహారం తీసుకోండివేసవిలో తేలికైన, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్‌లు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అధికంగా వేయించిన, మసాలా దినుసులు వేసిన ఆహారం తీసుకోకపోవడమే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు, ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి, వడదెబ్బ ప్రమాదాన్ని అధికం చేస్తాయి.
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MOREMay 26, 2026
మారుతున్న జీవనశైల...
READ MOREMay 25, 2026
చాలా మంది చర్మం జి...
READ MOREMay 23, 2026
వేసవి కాలంలో భానుడ...
READ MORE