▶ Reels

Heath Tips

తీపి తినాలనిపిస్తోందా..? ఐతే అది మీ శరీరమిస్తున్న హెచ్చరిక కావచ్చు..!


మీరు భోజనం చేయగానే ఏదైనా స్వీట్ తినాలని ఆరాటపడుతు న్నారా? చాక్లెట్లు, మిఠాయిలు కనిపిస్తే అస్సలు నియంత్రించు కోలేకపోతున్నారా? అయితే ఇది కేవలం మీ నాలుక రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదని గుర్తించండి. మీ శరీరంలో ఏదో అసమతుల్యత చోటుచేసుకుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం కావచ్చు. ఆయుర్వేదం ఈ 'షుగర్ క్రేవింగ్స్' గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఎందుకీ విపరీతమైన కోరిక..? సాధారణంగా ఆకలి వేసినప్పుడు శరీరం ఏదైనా ఆహారం కోరుకుంటుంది. కానీ, ప్రత్యేకంగా 'తీపి' మాత్రమే కావాలని పట్టుబట్టడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మీరు అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగి, మళ్లీ అంతే వేగంగా పడిపోతుంది. ఈ సమయంలో మెదడు తక్షణ శక్తి కోసం తీపిని కోరుకుంటుంది. ఇది ప్రీ-డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు.మనకు ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనల్ని తక్షణ ఉపశమనం కోసం చక్కెర లేదా జంక్ ఫుడ్ వైపు నడిపిస్తుంది. సరిగ్గా నిద్రపోని వారిలో ఆకలిని ప్రేరేపించే 'గ్రెలిన్' హార్మోన్ పెరుగుతుంది. ఇది తీపి పదార్థాల మీద కోరికను విపరీతంగా పెంచుతుంది. శరీరంలో మెగ్నీషియం, క్రోమియం లేదా జింక్ వంటి ఖనిజాల లోపం ఉన్నప్పుడు కూడా తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఎటువంటి విపరీతమైన కోరికలు కలగవు.

శరీరంలో వాతం పెరిగినప్పుడు మనసు అస్థిరంగా మారుతుంది. ఆ సమయంలో మనసును ప్రశాంత పరచడానికి శరీరం తీపిని ఆశిస్తుంది.

పిత్త దోషం అసమతుల్యత వల్ల కూడా శరీరంలో వేడి పెరిగి, చల్లని ,తీపి పదార్థాల మీద ధ్యాస మళ్లుతుంది.నిరంతరం తీపి తినాలనే కోరికను నియంత్రించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.. మీ భోజనంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారం చేర్చుకోండి. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది. ఒక్కోసారి దాహాన్ని కూడా మన మెదడు ఆకలిగా పొరబడుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి చూడండి. చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన తీపి ఉండే పండ్లు, ఖర్జూరాలు లేదా బెల్లం తక్కువ పరిమాణంలో తీసుకోండి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. మీకు ఈ కోరిక అదుపులో లేకపోతే ,అతిగా దాహం, తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహ...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **క...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్త...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE

ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తోందా..? ఐతే ఈ 5 ప్రధాన కారణాలను అస్సలు విస్మరించవద్దు..!

June 25, 2026

ఉదయం లేచింది మొదలు...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.