▶ Reels

ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. వైద్య పరిశోధనల్లో ఇక చిన్న ఆసుపత్రులకూ అవకాశం..

 

వైద్య పరిశోధనల (Medical Research) రంగాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు కేవలం పెద్దాసుపత్రులు, భారీ సంస్థలకే పరిమితమైన మెడికల్ రీసెర్చ్‌లలో ఇకపై చిన్న ఆసుపత్రులు కూడా భాగస్వాములు అయ్యేలా నిబంధన లను సులభతరం చేసింది.


'సింగిల్ ఎథిక్స్ రివ్యూ' విధానం..


ఒకప్పుడు ఏదైనా కొత్త మందు లేదా చికిత్సపై బహుళ ఆసుపత్రుల్లో (Multi-centric) పరిశోధన చేయాలంటే, ప్రతి ఆసుపత్రికి చెందిన ఎథిక్స్ కమిటీ (Ethics Committee) నుంచి విడివిడిగా అనుమతులు పొందాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఐసీఎంఆర్ కొత్త విధానాన్ని తెచ్చింది.


ఒకే పరిశోధన 10 లేదా 20 ఆసుపత్రుల్లో ఏకకాలంలో జరుగుతున్న ట్లయితే, ప్రతి ఆసుపత్రి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్దేశించిన ఒక ప్రధాన ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపితే, అన్ని కేంద్రాల్లోనూ పరిశోధనలు కొనసాగించవచ్చు.


చిన్న ఆసుపత్రులకు, గ్రామీణ కేంద్రాలకు వరం..


ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల వల్ల ప్రధానంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని ఆసుపత్రులకు మేలు జరగనుంది. సొంతంగా ఎథిక్స్ కమిటీలు లేని చిన్న ఆసుపత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు కూడా ఇకపై జాతీయ స్థాయి భారీ పరిశోధనల్లో పాలుపంచుకోవచ్చు.

దీనివల్ల కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన రీసెర్చ్ డేటా, ఇకపై పల్లెలు, చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తుంది. భిన్నమైన భౌగోళిక ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించడం వల్ల పరిశోధనల ఫలితాలు మరింత కచ్చితత్వంతో ఉంటాయి.


రోగుల భద్రతకే పెద్దపీట..


నిబంధనలు సులభతరం చేసినప్పటికీ, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఐసీఎంఆర్ కఠిన చర్యలు తీసుకుంటోంది. సింగిల్ కమిటీ ఆమోదం లభించినంత మాత్రాన ఆసుపత్రుల బాధ్యత తీరిపోదు. క్లినికల్ ట్రయల్స్ లేదా పరిశోధనల సమయంలో రోగుల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలి. ఏదైనా దుష్ప్రభావాలు (Adverse events) లేదా ఊహించని పరిణామాలు ఎదురైతే వెంటనే నివేదించాల్సిన బాధ్యత ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలపైనే ఉంటుంది.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహ...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **క...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్త...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.