▶ Reels

KFT అంటే ఏమిటి..? ఎందుకు అవసరం..?

 

దేశంలో గుండె జబ్బుల తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక సమస్య దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD). దేశంలో దాదాపు 14 కోట్ల మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందికి పైగా వ్యాధి ముదిరిన స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి మాత్రమే ఏకైక మార్గంగా మారుతోంది.


ఈ ప్రమాదకర ధోరణిని అరికట్టేందుకు, 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం రెండు సార్లు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) చేయించుకోవాలని ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల కీలక సిఫార్సు చేసింది. సమస్య ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే, ప్రాథమిక దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


KFT అంటే ఏమిటి..? ఎందుకు అవసరం..?


మూత్రపిండాలు ఎంత సమర్థంగా రక్తాన్ని శుద్ధి చేస్తున్నాయో తెలుసుకోవడానికి చేసే రక్త, మూత్ర పరీక్షల సమాహారమే 'కిడ్నీ ఫంక్షన్ టెస్ట్' (KFT).


సాధారణంగా కిడ్నీ వ్యాధులు తొలి దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలనూ చూపించవు. కిడ్నీ పనితీరు 50–60 శాతం దెబ్బతినే వరకు చాలామందికి సమస్య బయటపడదు. అందుకే KFT ద్వారా ముందస్తు హెచ్చరికలను పసిగట్టవచ్చు.


KFTలో చేసే ప్రధాన పరీక్షలు..


సీరం క్రియాటినిన్ (Serum Creatinine): కండరాల జీవక్రియలో వెలువడే వ్యర్థం ఇది. కిడ్నీల పనితీరు తగ్గితే రక్తంలో దీని స్థాయి పెరుగుతుంది.


ఈజీఎఫ్‌ఆర్ (eGFR - estimated Glomerular Filtration Rate)..కిడ్నీలు నిమిషానికి ఎంత రక్తాన్ని శుద్ధి చేయగలవో ఇది లెక్కిస్తుంది. కిడ్నీ వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడానికి ఇది కీలకం.


బ్లడ్ యూరియా / BUN..శరీరంలో ప్రొటీన్లు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరియాను మూత్రపిండాలు ఎంతవరకు బయటకు పంపుతున్నాయో తెలుపుతుంది.


యూరిన్ ఆల్బుమిన్ / ప్రొటీన్ (Urine Albumin): సాధారణ స్థితిలో మూత్రం ద్వారా ప్రొటీన్ బయటకు రాదు. మూత్రంలో ఆల్బుమిన్ కనిపిస్తే కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతింటున్నాయని అర్థం. ఎలక్ట్రోలైట్లు అంటే సోడియం, పొటాషియం.. శరీరంలో లవణాలు, ద్రవాల సమతుల్యతను అంచనా వేస్తాయి.


కిడ్నీ దెబ్బతింటోందని తెలిపే తొలి సంకేతాలు..


కింది మార్పులు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.


పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ వాపు రావడం, మూత్రంలో నురగ ఎక్కువగా రావడం లేదా మూత్రం రంగు మారడం, రాత్రి వేళల్లో తరచూ మూత్రవిసర్జనకు లేవడం, నిరంతర అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం, ఆకలి మందగించడం, వికారం, వాంతులు,

కారణం లేకుండా చర్మంపై దురదలు రావడం. 


ఎవరికి ముప్పు ఎక్కువ..?'


ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిదే అయినప్పటికీ, కింది సమస్యలు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్యుల పర్యవేక్షణలో KFT చేయించుకోవడం తప్పనిసరి:


దీర్ఘకాలిక మధుమేహం ఉన్నవారు


నియంత్రణలో లేని అధిక రక్తపోటు (bp) బాధితులు


కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు


ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నవారు


నిరంతరం పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు ఉన్నవారు


మూత్రపిండాలను దెబ్బతీసే రోజువారీ అలవాట్లు

మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పులు కిడ్నీలపై తీవ్ర భారాన్ని మోపుతాయి.


విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వాడటం..వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు మింగడం కిడ్నీ కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.


అధిక ఉప్పు వినియోగం..ఆహారంలో ఉప్పు ఎక్కువైతే రక్తపోటు పెరిగి కిడ్నీ రక్తనాళాలు దెబ్బతింటాయి.


తగినంత నీరు తాగకపోవడం..శరీరానికి తగినంత నీరు అందకపోతే వ్యర్థాలు రాళ్లుగా మారి కిడ్నీలను దెబ్బతీస్తాయి.


మూత్రాన్ని ఆపుకోవడం..ఎక్కువ సమయం మూత్రాన్ని నిలిపి ఉంచడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి క్రమంగా కిడ్నీలకు వ్యాపిస్తాయి.


ప్రాసెస్డ్ ఫుడ్స్..ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌లలో ఉండే అధిక సోడియం, ఫాస్ఫేట్లు కిడ్నీలపై భారం పెంచుతాయి.


రిపోర్టులో తేడాలు వస్తే కంగారు పడకండి..!


KFT పరీక్షలో క్రియాటినిన్ లేదా యూరియా కొద్దిగా పెరిగినంత మాత్రాన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని భయపడాల్సిన పనిలేదు. డీహైడ్రేషన్, తీవ్రమైన వ్యాయామం, జ్వరం లేదా కొన్ని తాత్కాలిక మందుల వల్ల కూడా ఆ స్థాయిల్లో హెచ్చుతగ్గులు రావొచ్చు.


రిపోర్టును స్వయంగా అంచనా వేసుకోకుండా నెఫ్రాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించండి. వైద్యుల సలహా మేరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా పునఃపరీక్ష చేయించుకోండి.


బీపీ, షుగర్‌ను కచ్చితమైన అదుపులో ఉంచుకోండి. డాక్టర్ సూచన లేకుండా ఎలాంటి మందులు, నాటు వైద్యాలు వాడవద్దు.

 రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, రోజుకు కనీసం 30 నిమిషాల నడక, ఏడాదికి కనీసం ఒక్కసారైనా సాధారణ రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవడం—ఇవే మీ కిడ్నీలకు శ్రీరామరక్ష!

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహà°...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **కà...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్తà...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-కà...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.