▶ Reels

ఇంట్లో లభించే ఈ సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకోవచ్చు..

 





దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులు, తరచుగా షాంపూ వాడటం వల్ల జుట్టు తన సహజసిద్ధమైన మెరుపును కోల్పోయి పొడిబారి పోతుంది. రసాయనాలతో కూడిన ఖరీదైన ట్రీట్‌మెంట్లపై ఆధారపడేకంటే, ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టును మృదువుగా, పట్టుకుచ్చులా మార్చుకోవచ్చు.


కలబంద, పెరుగు మాస్క్..


ఒక గిన్నెలో రెండు చెంచాల కలబంద (aloe vera) జెల్, రెండు చెంచాల పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఆ తర్వాత సాధారణ నీటితో, తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే కేశాలకు తగినంత తేమ అంది మృదువుగా మారతాయి.


అరటిపండు, తేనె..


బాగా పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసి, దానికి ఒక చెంచా స్వచ్ఛమైన తేనె జతచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అరటిపండులోని సహజ కండిషనింగ్ గుణాలు, తేనెలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన జుట్టును నిగనిగలాడేలా చేస్తాయి.


కొబ్బరినూనె, కలబంద..


కొద్దిగా కొబ్బరి నూనెలో తగినంత కలబంద జెల్ కలిపి తేలికపాటి హెయిర్ మాస్క్ తయారుచేసుకోవాలి.ముఖ్యంగా చిట్లిపోయి, పొడిబారిన జుట్టు చివర్లకు దీన్ని రాసి 20 నుంచి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.


జిడ్డు చర్మం (oily skin) ఉన్నవారు ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు కాకుండా కేవలం జుట్టు పొడవుకు మాత్రమే అప్లై చేయడం మంచిది.


కోడిగుడ్డు, పెరుగు..


ఒక కోడిగుడ్డును బాగా గిలకొట్టి, అందులో రెండు చెంచాల పెరుగు కలపాలి.ఈ ప్యాక్‌ను కేశాలకు పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి లేదా సాధారణ నీటితో కడిగేయాలి.గుడ్డులోని ప్రోటీన్ జుట్టుకు బలాన్నిస్తుంది. గుడ్డు వాసన పడని వారు లేదా అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు.


ఓట్స్, పెరుగు ప్యాక్..


రెండు చెంచాల ఓట్స్ పొడిలో, రెండు చెంచాల పెరుగు కలిపి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి.దీన్ని జుట్టుకు సున్నితంగా పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్‌ను తలపై గట్టిగా రుద్దకూడదు, అలా చేస్తే మాడు పొడిబారి చికాకు కలిగే ప్రమాదం ఉంది. వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి జుట్టు స్వభావం మారుతుంటుంది కాబట్టి, మీ కేశాలకు సరిపడే ప్యాక్‌ను ఎంచుకుని వారానికి ఒకసారి వాడటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహà°...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **కà...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్తà...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-కà...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.