▶ Reels

3 వారాలకు పైగా దగ్గు ఉంటే..? టీబీ కావొచ్చా..? ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కండి..

 

సాధారణంగా సీజన్ మారినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల లేదా గొంతులో సమస్యల కారణంగా దగ్గు రావడం సహజం. ఇది శరీరం రక్షించుకునే సహజ విధానం. అయితే, ఈ సాధారణ దగ్గు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. మరీ ముఖ్యంగా మూడు వారాలకు పైగా దగ్గు వేధిస్తుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


3 వారాల దగ్గు.. టీబీకి సంకేతమా..?


దీర్ఘకాలిక దగ్గు అనగానే అందరిలోనూ క్షయవ్యాధి (TB) గురించిన భయం కలుగుతుంది. మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు దగ్గు ఉంటే వైద్యులు కచ్చితంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తారు.


టీబీ ఇతర ముఖ్యమైన లక్షణాలు..


దగ్గుతో పాటు కఫం లేదా రక్తం పడటం


ఛాతిలో నొప్పి, విపరీతమైన నీరసం


ఆకలి తగ్గడం, కారణం లేకుండా బరువు కోల్పోవడం


సాయంత్రం వేళల్లో జ్వరం, రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం


ఇలాంటి లక్షణాలలో కొన్ని ఏకకాలంలో కనిపిస్తే వెంటనే పల్మనాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. కేవలం టీబీ మాత్రమే కాదు.. ఈ సమస్యలు కూడా కారణమే..! మూడు వారాలకు మించి ఉండే ప్రతి దీర్ఘకాలిక దగ్గుకూ టీబీనే కారణం కానక్కర్లేదు. దీని వెనుక ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. 


ఆస్తమా, అలర్జీలు..కొందరిలో దగ్గుతో పాటు ఆయాసం రావడం, శ్వాస తీసుకునేటప్పుడు పీపీ మ్రోగినట్లు శబ్దం రావడం జరుగుతుంది. సీఓపీడీ (COPD)..దీర్ఘకాలికంగా ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తులు దెబ్బతిని క్రమంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.


యాసిడ్ రిఫ్లక్స్..జీర్ణ సమస్యల కారణంగా గొంతులో మంట, దీర్ఘకాలిక దగ్గు వస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్..క్యాన్సర్ ప్రాథమిక దశలో కూడా దగ్గు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, కాలక్రమేణా పెరుగుతుంది.


ఎప్పుడు అత్యవసరంగా డాక్టర్‌ను కలవాలి..?


దగ్గు మూడు వారాలకు మించి కొనసాగుతుంటే. దగ్గుతో పాటు రక్తం పడుతుంటే.ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటే. స్పష్టమైన కారణం లేకుండా వేగంగా బరువు తగ్గుతుంటే. సొంత వైద్యం చేసుకుంటూ దగ్గును మందులతో తాత్కాలికంగా అణచివేయడం సరికాదు. సమస్య తీవ్రం కాకముందే వైద్యులను సంప్రదించి సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ప్రాణాపాయం నుండి రక్షిస్తుంది.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహà°...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **కà...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్తà...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-కà...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.