▶ Reels

బ్రెయిన్ స్ట్రోక్ : ప్రాణాలు కాపాడే ముందస్తు లక్షణాలు ఇవే..!

 


మెదడుకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా నిలిచిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరిగినప్పుడు 'బ్రెయిన్ స్ట్రోక్' వస్తుంది. ఇలాంటప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైంది. స్ట్రోక్ వచ్చే ముందు శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. వైద్య పరిభాషలో వీటిని సులభంగా గుర్తుంచుకోవడానికి 'B.E. F.A.S.T' (బీ ఫాస్ట్) అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


B - Balance (బ్యాలెన్స్ కోల్పోవడం).. అకస్మాత్తుగా నడకలో తడబాటు రావడం, తూలిపోవడం, కళ్లు తిరగడం లేదా నిలబడలేకపోవడం.


E - Eyes (చూపులో మార్పులు).. హఠాత్తుగా ఒక కన్ను లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం, వస్తువులు రెండు రెండుగా కనిపించడం లేదా పూర్తిగా చీకటిగా మారిపోవడం.


F - Face (ముఖం వంకరపోవడం).. నవ్వినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు ముఖం ఒకవైపుకు లాగేసినట్లు అవ్వడం లేదా మూతి వంకరపోవడం. ముఖంలో ఒకవైపు స్పర్శ తెలియకపోవడం.


A - Arms (చేతులు, కాళ్లలో బలహీనత)..అకస్మాత్తుగా శరీరంలో ఒకవైపు చేయి లేదా కాలు పడిపోయినట్లు అవ్వడం, తిమ్మిరిగా అనిపించడం. రెండు చేతులు పైకి ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు ఒక చేయి కిందికి పడిపోవడం.


S - Speech (మాట తడబడటం).. మాట్లాడటానికి ఇబ్బంది పడటం, మాట స్పష్టంగా రాకపోవడం లేదా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం.


T - Time (సమయం మించిపోకముందే..).. పైన చెప్పిన లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇది స్ట్రోక్ అని గుర్తించి, వెంటనే పేషెంట్‌ను న్యూరాలజీ/స్ట్రోక్ యూనిట్ సౌకర్యం ఉన్న ఆసుపత్రికి తరలించాలి.


మరికొన్ని ఇతర లక్షణాలు..


వీటితో పాటు, ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా విపరీతమైన తలనొప్పి దీనితో పాటు వాంతులు కూడా ఉండొచ్చు. రావడం కూడా స్ట్రోక్‌కు ముఖ్యంగా హెమరేజిక్ స్ట్రోక్ ఒక ప్రధాన సంకేతం.


ఈ లక్షణాలు కొన్ని నిమిషాల పాటు కనిపించి తగ్గిపోయినా దీనిని మినీ స్ట్రోక్ లేదా TIA అంటారు, భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ రావడానికి అది ఒక హెచ్చరిక లాంటిది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహà°...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **కà...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్తà...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-కà...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.