హెల్త్ ఎక్స్ పర్ట్ : ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' వైరస్ ఒకటి. మానవులతో పాటు కోతులు, చింపాంజీల వంటి క్షీరదాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలు దక్కడం చాలా కష్టం. ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఎక్కడ పుట్టింది..? వ్యాప్తి ఎలా జరుగుతుంది..?
1976లో సెంట్రల్ ఆఫ్రికాలోని మారుమూల అడవుల్లో ఈ వైరస్‌ను మొదటిసారిగా గుర్తించారు. 'టెరోపోడిడే' జాతికి చెందిన గబ్బిలాలు (Fruit Bats) ఈ వైరస్‌కు సహజ వాహకాలు. ఇది గాలి ద్వారా వ్యాపించదు. బాధితుల రక్తం, లాలాజలం, ఇతర శరీర ద్రవాలను (Bodily Fluids) నేరుగా తాకడం ద్వారా మాత్రమే ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. ఎబోలా సోకిన వారిలో మరణాల రేటు దాదాపు 50 శాతంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది 90శాతం వరకు కూడా వెళ్లొచ్చు.
ముఖ్య లక్షణాలు 2 నుండి 21 రోజుల్లోగా బయటపడతాయి..
వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత లక్షణాలు కనిపించడానికి 2 నుండి 21 రోజులు పడుతుంది. లక్షణాలు బయటపడే వరకు వీరి నుండి ఇతరులకు వైరస్ వ్యాపించదు.
- అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, నీరసం, తలనొప్పి, గొంతునొప్పి.
- వ్యాధి ముదిరితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి.
- లివర్, కిడ్నీల పనితీరు మందగించడం.
- తీవ్రమైన పరిస్థితుల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం (చిగుళ్లు, మలం ద్వారా రక్తం కారడం).
గమనిక: దీని లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ వంటి సాధారణ జ్వరాలను పోలి ఉండటం వల్ల కేవలం క్లినికల్ పరీక్షల (ల్యాబ్ టెస్టుల) ద్వారానే దీన్ని నిర్ధారించడానికి వీలుకలుకలుగుతుంది.
చికిత్స - నివారణ..
ఎబోలాకు సకాలంలో స్పందించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. ఓరల్ లేదా ఐవీ ఫ్లూయిడ్స్ సలైన్ ద్వారా రోగి శరీరంలో డీహైడ్రేషన్ తగ్గించడం ప్రాథమిక చికిత్స. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాధి చికిత్స కోసం mAb114, REGN-EB3 అనే మోనోక్లోనల్ యాంటీబాడీ మందులను సిఫార్సు చేస్తోంది. ఎబోలా నివారణకు ప్రస్తుతం Ervebo, Zabdeno & Mvabea అనే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎబోలా మహమ్మారిని అరికట్టడంలో ప్రజా చైతన్యం (Community Engagement), బాధితులతో తిరిగిన వారిని గుర్తించడం (Contact Tracing), ఆసుపత్రులలో పరిశుభ్రత పాటించడం అత్యంత కీలకం.
ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి. మానవులతో పాటు కోతులు, చింపాంజీల వంటి క్షీరదాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలు దక్కడం చాలా కష్టమని చెబుతున్నారు పరిశోధకులు. ఎబోలా వైరస్ చరిత్ర, దాని లక్షణాలు, వ్యాప్తి,నివారణోపాయాలను గురించి మరిన్ని వివరాలను.....అడిగి తెలుసుకుందాం..
1.ఎబోలా వైరస్‌కు సహజ వాహకాలుగా పనిచేసే జీవులు ఏవి? మనుషులకు ఇది ఎలా సంక్రమిస్తుంది..?
2.ఎబోలా వైరస్ ఒకరి నుండి మరొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది..? గాలి ద్వారా ఇది వ్యాపిస్తుందా..?
3.ఎబోలా వ్యాధి ఇన్‌క్యుబేషన్ పీరియడ్ (Incubation Period) ఎంత..? 4.లక్షణాలు లేని వ్యక్తి నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుందా..?
5.ఎబోలా సోకిన వారిలో కనిపించే ప్రాథమిక తీవ్రమైన లక్షణాలు ఏమిటి..?
6.ఎబోలా వ్యాధిని కేవలం శారీరక లక్షణాల ద్వారా గుర్తించడం ఎందుకు కష్టం..? దీన్ని ఏ ఇతర వ్యాధులతో పొరబడే అవకాశం ఉంది..?
7.గత ఎబోలా అవుట్‌బ్రేక్స్ ఆధారంగా ఈ వ్యాధి సగటు మరణాల రేటు (Case Fatality Rate) ఎంత శాతంగా ఉంది..?
8.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన ఎబోలా మోనోక్లోనల్ యాంటీబాడీ మందుల పేర్లు ఏమిటి..?
9.ప్రస్తుతం ఎబోలా నివారణకు అందుబాటులో ఉన్న రెండు ఆమోదిత వ్యాక్సిన్స్ ఏమేం ఉన్నాయి..?
10. ఎబోలా వంటి ప్రమాదకరమైన మహమ్మారిని అరికట్టడంలో 'కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్', 'కాంటాక్ట్ ట్రేసింగ్' ఎందుకు కీలకం..?
11.ఎబోలా వ్యాధి అంటే ఏమిటి? ఇది మొదటిసారిగా ఎప్పుడు, ఎక్కడ వచ్చింది..?


