ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో 'ఎబోలా' ఒకటి
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MORE
ప్రకృతి వైపరీత్యాలు కేవలం వాతావరణాన్ని మాత్రమే కాదు.. మనిషి ఆరోగ్యాన్ని కూడా శాసిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారిన 'సూపర్ ఎల్ నినో' మన ఆరోగ్యంపై దీని ప్రభావమెంత ఉంటుంది..? నిజంగా ఇది డేంజరా..? సముద్ర మట్టాల్లో వచ్చే ఉష్ణోగ్రత మార్పులు సామాన్యుడి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఏమిటి..? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..
అసలు 'సూపర్ ఎల్ నినో' అంటే ఏమిటి..?పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దానిని 'సూపర్ ఎల్ నినో'గా పిలుస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కొన్ని చోట్ల తీవ్రమైన కరువు కాటకాలు, మరికొన్ని చోట్ల అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. మన దేశంలో దీని ప్రభావం వల్ల వేసవి తీవ్రత పెరగడం, రుతుపవనాలు బలహీనపడటం వంటి మార్పులు సంభవిస్తాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, తేమలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల శరీరంలోని ఉష్ణ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది ప్రాణాంతక మైన వడదెబ్బకు దారితీయవచ్చు. అకాల వర్షాలు, వరదల వల్ల తాగునీరు కలుషితమై కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు దోమల సంతతి పెరగడానికి దోహదపడతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసులు పెరిగే ఆస్కారం ఉంది. తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల గాలిలో ధూళి కణాలు పెరిగి, అస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ వ్యాధులు ఉధృతమవుతాయి.
సూపర్ ఎల్ నినో నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారిన 'సూపర్ ఎల్ నినో' మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యనిపుణులు, వాతావరణ శాఖా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో లవణాల సమతుల్యత దెబ్బతికుండా ఉంటుంది. నిల్వ ఉంచిన పదార్థాలు, రోడ్ల పక్కన అమ్మే ఆహారానికి దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో గొడుగు, టోపీ ధరించాలి. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు చేరకుండా జాగ్రత్త వహించాలి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు..
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MOREMay 26, 2026
మారుతున్న జీవనశైల...
READ MOREMay 25, 2026
చాలా మంది చర్మం జి...
READ MOREMay 23, 2026
వేసవి కాలంలో భానుడ...
READ MORE